ఈ నెల 30న రాజగోపాల్ రెడ్డితో ఉత్తమ్ భేటీ

ఈ నెల 30న రాజగోపాల్ రెడ్డితో ఉత్తమ్ భేటీ

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారనే వార్తలతో కాంగ్రెస్ అగ్ర నేతలు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఢిల్లీలో సమావేశమైన నేతలు.. పార్టీ మారకుండా ఆయన్ను ఒప్పించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన బాధ్యతను ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. ఈ క్రమంలోనే శనివారం రాజగోపాల్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు.  

పార్టీ వీడకుండా ఆయన్ను ఒప్పించేందుకు ఉత్తమ్ ప్రయత్నం చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అటు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీ రావాలని పిలిచినట్లు తెలుస్తోంది.